Monday, 16 March 2026
Swasthik News
Home / భక్తి వార్తలు

మార్చి 27న గుంటూరులో భారీ శోభయాత్ర

08 Feb 2026
08:12 PM
462

స్వస్తిక్ న్యూస్, గుంటూరు:-  గుంటూరు నగరంలో ప్రతి శ్రీరామనవమి పండుగ నాడు "శ్రీరామ ఉత్సవ సమితి" ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర  ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు కె.లోకేశ్ గుప్తా మాట్లాడతా.. గుంటూరు నగరంలో గత 8 ఏళ్లుగా శ్రీరామనవమి శోభాయాత్ర "శ్రీరామ ఉత్సవ సమితి" సమితి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు.

Article Image

 ఈ ఏడాది 9వ సారి శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి శోభయాత్ర చేస్తున్నామని శ్రీరాముల వారి రథం గుంటూరు ప్రధాన దేవాలయాలను కలుపుకుంటూ సాగుతుందన్నారు. మార్చి 27వ తారీకున  శ్రీరామనవమి రోజు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఉదయం మొదలయ్యే శోభాయాత్రలో గుంటూరులో ఉన్న హిందువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రాములవారి కరుణ కటాక్షాల్ని పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంగళరావు,తిరుపతి రావు గారు, గాదె వెంకటేశ్వర్లు, కె లోకేష్ ,చల్లా బ్రహ్మ రెడ్డి,వేణుగోపాల్,ఫణీంద్ర,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (1)

K
K.Hyndavi • 09 Feb, 2026

Yes