స్వస్తిక్ న్యూస్,రాజకీయం:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య రాజకీయ నాయకులు బూతుల పురాణాలు చేస్తున్నారు. ప్రజలకు నాలుగు మంచి పనులు చేసి పెడుతూ గాడి తప్పిన వ్యక్తులను గాడిలో పెట్టాల్సినటువంటి నాయకులే బూతులు మాట్లాడుతూ ఈరోజు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అని యువతతో పాటు చాలా మంది ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడిన అసభ్యకర మాటలకు టీడీపీ కార్యకర్తలు వారి ఇంటిని ధ్వంసం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గతంలో టీడీపీ పార్టీ నాయకులు కూడా ఇలా అసభ్యకర వ్యాఖ్యలు చేసారు.

ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ప్రచారం చేస్తున్న సందర్భాలులో అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. నాయకులు ఒకరిపై ఒకరు బూతులతో విమర్శించుకుంటూ ఉన్నారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ని "అరే పొట్టోడా" అంటూ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయగా మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ "బేవకూఫ్" అని విమర్శలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం తగ్గకుండా బీఆర్ఎస్ కు ఇదే సరైన భాష అంటూ బూతులు ప్రయోగిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఒరేయ్, లుచ్చా, హౌలా అంటూ ఈమధ్య రాజకీయ నాయకుల నోటి నుంచి ఈ అసభ్యకర మాటలు కామన్ అయిపోయాయి.ఉన్నత పదవుల్లో ఉంటూ వీరు ఇలాంటి అసభ్యకర భాష మాట్లాడటం పై మాకు విరక్తి కలుగుతుంది అంటూ ప్రజలు సైతం నాయకులను అసహ్యించుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాజకీయాలంటేనే విమర్శకు ప్రతి విమర్శలు అంటూ.. ఇంకా ఎక్కువైతే దాడులు చేసుకోవడం తప్పించి మరొక అంశమే లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీలైతే ప్రజల సమస్యలను అప్పటికప్పుడు తీర్చాలి కానీ ఇలా ఎన్నికల ప్రచారాలలో భాగంగా మంచి పథకాలు ఇస్తాము అని చెప్పాల్సింది పోయి.. ప్రతి రాజకీయ నాయకుడు ఇతర నాయకులపై ఇలా అసభ్యకర వ్యాఖ్యలు చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అని ప్రజల విజ్ఞప్తి.
