Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు : KTR

23 Jan 2026
02:09 PM
54

TELANGANA :-  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులకు మేం భయపడతామని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ఎటువంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు.. ఏ తప్పు చేయనప్పుడు పోలీసులు ముందు హాజరయ్యేందుకు మాకు ఎలాంటి సమస్య కూడా లేదు అని తెలిపారు. పొరపాటున కూడా నా రాజకీయ జీవితంలో తప్పుడు పనులు చేయలేదు అని అన్నారు.  గతంలో  మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను కొనేందుకు 50 లక్షల రూపాయలతో వచ్చిన ఒక దొంగను పట్టుకున్నాము అని.. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ దొంగే సీఎం అయ్యాడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కొద్ది గంటల ముందే ఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం రోజున హరీష్ రావును ప్రశ్నించిన మాదిరే సాయంత్రం వరకు కూడా కేటీఆర్ ను విచారణ కొనసాగించే అవకాశం ఉంది.

 ఇవి కూడా చదవండి..

https://swasthiknews.com/news/megastar-chiranjeevi-sasirekha-song-release-830

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!