స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం(ఈరోజు) "ప్రజా దర్బార్" నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రజా సమస్యలను అర్జీల రూపంలో తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్జీలు పంపి వాటిని నిర్దిష్టమైన గడుపులోగా నూరు శాతం పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తారని అర్జీదారులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు ,మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి , కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.