స్వస్తిక్ న్యూస్,త్రిపురాంతకం :- భారత దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలతో నెలకు ఒకసారి నిర్వహించే ప్రజాదరణ పొందిన “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ఈరోజు త్రిపురాంతకం మండలంలో వీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని త్రిపురాంతకం మండలంలో మండల అధ్యక్షురాలు శ్రీమతి ముని మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులతో పాటు మండలంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమక్షంలో ప్రధానమంత్రి గారి “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధి, యువత పాత్ర, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పురోగతి, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు కొండ్రు పిచ్చయ్య మాట్లాడుతూ, “మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలతో ప్రధానమంత్రి గారి నేరుగా సంభాషించే వేదిక. ఇది ప్రజల్లో చైతన్యం కలిగించే గొప్ప కార్యక్రమం” అని తెలిపారు. అలాగే త్రిపురాంతకం మండల పార్టీ ఉపాధ్యక్షులు పాతకోటి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రధానమంత్రి గారి సందేశాలను ఆచరణలో పెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అన్నా గురునాథం, సోమశేఖర్, సుమంతు, పాఠశాల సిబ్బంది, హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.