స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :-పుల్లలచెరువు మండలం, పీఆర్‌సీ తాండ గ్రామ పంచాయితీలో “రైతన్నా మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికి వెళ్లి రైతులను కలుసుకున్నారు. రైతులకు కరపత్రాలు అందజేస్తూ వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులకు అందుబాటులో ఉన్న పథకాలు, సబ్సిడీలు, ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, గ్రామ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. నాయకులు గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.