స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో "ఎస్.ఐ.ఆర్" (S.I.R) కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు , మండల టీడీపీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి , మాజీ ఎంపీపీ మంత్రు నాయక్ , మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు మండల పరిధిలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ల జాబితాపై చర్చ:-ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న ప్రజా ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించి జరుగుతున్న 'ఎస్.ఐ.ఆర్' (S.I.R) ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులైన ఓటర్ల మార్పులు, చేర్పులను సవివరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కార్యకర్తల సమస్యల పరిష్కారానికి హామీ...మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు.