Friday, 17 April 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

​నాసిక్ టీసీఎస్ (TCS) కేసులో కీలక మలుపు: పరారీలో లేనన్న నిదా ఖాన్ కుటుంబం

17 Apr 2026
04:21 PM
3

స్వస్తిక్ న్యూస్ , నేషనల్:- టీసీఎస్ అనుబంధ బీపీఓ (BPO) లో జరిగినట్లుగా చెబుతున్న లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి ఆరోపణల కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ పరారీలో ఉన్నారన్న వార్తలను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

కుటుంబ సభ్యుల వివరణ:-నిదా ఖాన్ ఎక్కడికీ వెళ్లలేదని, ఆమె ముంబైలోని తన నివాసంలోనే ఉన్నారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, అందుకే బయటకు రావడం లేదని వారు వెల్లడించారు. అంతేకాకుండా, ఆమెపై వస్తున్న ఉద్యోగ పరమైన ఆరోపణలను కూడా వారు తోసిపుచ్చారు ఆమె టీసీఎస్ లో హెచ్.ఆర్ (HR) కాదని, కేవలం ఒక టెలీ కాలర్ మాత్రమేనని తెలిపారు.​ఆమె పరారీలో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.వాస్తవాల నిర్ధారణ ముఖ్యం.ఈ కేసుపై సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా విచారణ (Media Trial) కంటే కూడా వాస్తవాల నిర్ధారణే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజా నిజాలను వెలికితీయాల్సి ఉంది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates