Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

​'ఇంకా 72 గంటలే ఉంది'.. పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు!

26 Apr 2026
02:16 PM
115

స్వస్తిక్ న్యూస్, నేషనల్ :- దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ తాజాగా ఒక 'సెటైరికల్' ట్వీట్ చేసింది.

ట్వీట్ సారాంశం:- ​పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 29న జరగనున్న రెండో విడత పోలింగ్‌కు కేవలం 72 గంటలే సమయం మిగిలి ఉందని కాంగ్రెస్ గుర్తు చేసింది. ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే సామాన్యుడిపై ధరల భారం పడనుందని, పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయని ఆ ట్వీట్ ద్వారా పరోక్షంగా ఎద్దేవా చేసింది.ముగిసిన పోలింగ్ కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి మరియు అస్సాం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది.​ఫలితాల వెల్లడి అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచి, ఓటింగ్ ముగియగానే పెంచడం కేంద్రానికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ ఈ సందర్భంగా విమర్శించింది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates