స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చాలా మంది సొంత ఇల్లు లేక ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా గోడు వినిపించుకుంటున్న వేల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికీ గుడ్ న్యూస్ తెలిపారు. తాజాగా రాష్ట్రంలో అర్హులందరికీ రెండే రెండు సంవత్సరాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గ్రామాలలో అయితే 3 సెంట్లు అదే పట్టణాలలో అయితే 2 సెంట్లు చొప్పున భూమిని అందజేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఒకవేళ అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే వెంటనే ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి మరి ఇళ్ల స్థలాలను అర్హులకు ఇవ్వాలి అని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కాలనీలో మంజూరైన ఇల్లు వద్దనుకున్న వారికి వెంటనే రద్దుచేసి.. అక్కడ కానీ లేదా మరోచోట కానీ మూడు సెంట్లు ఇవ్వాల్సిందే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.