స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- విద్యద్వారానే ఉన్నతమైన భవిష్యత్తును పొందగలుగుతారని ఎస్సై సంపత్ కుమార్, ఎంఈవో ఇందిరా ప్రసాద్ అన్నారు. శనివారం పుల్లలచెరువులోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు వెంకట్ ప్రభూజీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుతగా సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వ్యక్తులు ,పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమవంతుగా సహకరిస్తామన్నారు.1962 వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ పాఠశాల ఎందరికో ఉన్నత భవిష్యత్తు అందించేందుకు బాటలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్కూల్ కమిటీ చైర్మన్ కొలుకులూరి కృష్ణయ్య, టీడీపీ మాజీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, నాయకులు హనుమంతరావు, భాస్కర్, సర్పంచ్ ఓబులేష్, జీవి గురునాదం, ఇదెమ్మ, ఆర్మీ బుజ్జి, మేడికొండ. రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.