»పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై కీలక చర్చ
»పాల్గొన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు
స్వస్తిక్ న్యూస్ ,పుల్లలచెరువు :- యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు, పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 'రెండో బుధవారం' మండల స్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యారు.సమావేశంలో ప్రధానంగా మండల పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలు, తక్షణమే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఏకగ్రీవంగా పార్టీ తీర్మానాలను ఆమోదించారు.

ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షుడు పోట్ల గోవిందు, సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య, మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షుడు మేడికొండ లక్ష్మణ్, పాతకోట రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శనగ వెంకటేశ్వర రెడ్డి, గద్దె వెంకటేశ్వర్లు, మెకానిక్ మేడికొండ అనిల్, కొలుకులూరి కుమార్, సిద్ధన్నపాలెం సుబ్బారావు, సూరాబత్తుని రమేష్, గద్దె మల్లయ్య తదితరులతో పాటు ముటుకుల గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.