స్వస్తిక్ న్యూస్, తెలంగాణ:-
మహబూబాబాద్:- పoడుగ పూట ఒకే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భోజనం చేస్తూ గొంతులో మాంసం ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు:- జిల్లాలోని దామరవంచ శివారు పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోతు బిచ్చా (54) అనే వ్యక్తి తన ఇంట్లో దుర్గమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సంబరాల్లో భాగంగా రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా మాంసం ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది.
ఊపిరాడక ఇబ్బంది:- ముక్క ఇరుక్కోవడంతో బిచ్చా ఊపిరి అందక విలవిల్లాడిపోయారు.
ఆసుపత్రికి తరలింపు:- గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల నిర్ధారణ:- పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ రోజే కుటుంబ యజమాని మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.