Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / సినిమా

నటన అదుర్స్ కానీ.. బైకర్ మూవీ రివ్యూ

03 Apr 2026
08:04 AM
159

స్వస్తిక్ న్యూస్, సినిమా రివ్యూ:-  హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బైకర్’. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే..తన కొడుకును ఎలాగైనా మోటోక్రాస్ ఛాంపియన్‌గా చూడాలని కలలు కనే తండ్రి పాత్రలో రాజశేఖర్ నటించారు. అయితే అనుకోని కారణాల వల్ల మధ్యలోనే రేసింగ్ వదిలేసే కొడుకుగా శర్వానంద్ కనిపించారు. వీరిద్దరి మధ్య నడిచే డ్రామానే 'బైకర్' చిత్ర మూల కథ.

సినిమాలో ప్లస్ పాయింట్స్:- ఈ సినిమాలో ప్రధాన బలం నటీనటుల పెర్ఫార్మెన్స్. శర్వానంద్, రాజశేఖర్ ఇద్దరూ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక సాంకేతికంగా చూసుకుంటే, బైక్ రైడింగ్ కు సంబంధించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత దక్కింది. సినిమాలో రాసిన కొన్ని డైలాగులు కూడా బాగున్నాయి.

సినిమాలో మైనస్ పాయింట్స్:- మంచి నటీనటులు, విజువల్స్ ఉన్నప్పటికీ సినిమా కొన్ని విషయాల్లో నిరాశపరిచింది. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య పండాల్సిన ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా రొటీన్‌గా, నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు ప్రధాన మైనస్. ఇక సంగీతం కూడా గొప్పగా లేదు, జస్ట్ పర్వాలేదు అనిపించేలా ఉంది.

తుది తీర్పు :- మొత్తంగా చూసుకుంటే.. నటీనటుల ప్రతిభ, గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే కారణంగా 'బైకర్' చిత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్: 2.5/5

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates