Monday, 16 March 2026
Swasthik News
Home / సినిమా

పిల్లల్ని కనడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి వరలక్ష్మి

13 Mar 2026
11:58 AM
472

స్వస్తిక్ న్యూస్, సినిమా :-  టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ రోజుల్లో భార్య భర్తలు పిల్లలను కనడం పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా స్థిరపడకుండా.. ఆర్థికంగా నిలదొక్కుకోకుండా ఈరోజుల్లో దంపతులు చాలా ఈజీగా పిల్లలను కంటున్నారు అని అన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరంగా బల్పడినప్పుడే పిల్లలను కనాలి అని సూచించారు.

Article Image

 బిడ్డలను కనడం, పెంచడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తేల్చి చెప్పారు. అలాగే సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా, ఆర్థికంగా స్థిరంగా లేకుండా పిల్లలను కనకూడదు అని.. అది మొదటిలో బాగున్నా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందిగానే మారుతుంది అని తెలియజేశారు. కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకొని ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి అని సూచించారు. బిడ్డలను కనడానికి నేను ఎటువంటి వ్యతిరేకం కాదు...  కానీ మీకు ఎవరు ఆర్థికంగా సహాయం చేయరు అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి అని తెలియజేశారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!