స్వస్తిక్ న్యూస్, సినిమా :- టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి పూర్ణ (శమ్నా కాసిమ్) ఇంట వేడుక మొదలైంది. ఆమె రెండోసారి మాతృత్వపు తీపిని అనుభవించారు. పూర్ణ మంగళవారం ఉదయం ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఆనందంలో కుటుంబ సభ్యులు.. డెలివరీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా జరిగిందని, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసిఫ్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా తనకు తోడుగా ఉన్న దేవుడికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.కేరళకు చెందిన పూర్ణ, మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించినప్పటికీ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.'సీమ టపాకాయ్', 'అవును', 'సుందరి', మరియు బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'లో ఆమె కీలక పాత్ర పోషించి మెప్పించారు.