స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- స్థానిక 132 KV విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల పనుల కారణంగా పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల పరిధిలోని 33 KV విద్యుత్ కేంద్రాలకు చెందిన గ్రామాల్లో నేడు (ఆదివారం) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని అధికారులు కోరారు.