స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- వైసీపీ కీలకనేత, మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్ లో భాగంగా జైలులో గడుపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నటువంటి అంబటి రాంబాబుకు గుంటూరు న్యాయస్థానం కాస్త రిలీఫ్ ప్రకటించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అని గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిరోజు కూడా ఇంటి భోజనం, మంచం, కూలార్ మరియు వైద్య సాయం కోరుతూ అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు అతను అడిగినవన్నీ చేయాలి అని తీర్పునిచ్చింది. ఒక మాజీ మంత్రి కావడంతో ప్రత్యేకమైనటువంటి రిమాండ్ ఖైదీగా పరిగణించి నిబంధనల ప్రకారం అతనికి అన్ని వసతులు కూడా కల్పించాలి అని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించడంతో.. అంబటి రాంబాబుకు కాస్త రిలీఫ్ దొరికింది. ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గత కొద్దిరోజుల క్రితం అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత పలు కేసులలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.

ఇప్పటికే వైసీపీ నేతలు చాలామంది జైలు జీవితాన్ని గడుపుతున్న సందర్భాలు చూశాం. అంబటి రాంబాబు జైలుకు వెళ్లడంపై వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తే చర్యకు ప్రతి చర్యలు ఉంటాయి అని హెచ్చరించిన విషయాలు కూడా ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్నాయి. దీంతో అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు మధ్య తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణంలో కనపడే పరిస్థితులు త్వరలో ఉండే అవకాశాలు ఉన్నాయి.