స్వస్తిక్ న్యూస్,రాజకీయం :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఒక అందమైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జీవిత ప్రయాణంలో తోడుగా..ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక భావోద్వేగ సందేశాన్ని రాశారు.నా జీవిత ప్రయాణంలో అడుగడుగునా తోడుగా ఉంటూ, నాకు అండగా నిలిచిన నా భార్యతో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
శుభాకాంక్షల వెల్లువ:- ముఖ్యమంత్రి పంచుకున్న ఈ ఫోటోపై అభిమానులు మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వీరిద్దరినీ 'అన్యోన్య దంపతులు' అని కొనియాడుతూ, ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటూ 'క్యూట్ ఫోటో'గా నిలుస్తోంది.