స్వస్తిక్ న్యూస్,A.P:-INTER RESULTS:-
అమరావతి:-ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన 5 గ్రూప్ సబ్జెక్టులతో పాటు, అదనంగా ఆరో (6th) సబ్జెక్టును కూడా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం, ఈ అదనపు సబ్జెక్టుకు సంబంధించిన ఫలితాలను వెల్లడించే విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రత్యేక ఫలితాలు:- అదనపు సబ్జెక్టు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని లేదా నేరుగా ఆయా కళాశాలలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఇంటర్మీడియట్ (గ్రూప్ సబ్జెక్టుల) ఫలితాలను ఈ నెల 15 నుండి 20వ తేదీ మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.
లక్ష్యం: విద్యార్థులకు వారి అదనపు సబ్జెక్టు మార్కుల పట్ల స్పష్టత ఇవ్వడమే ఈ ప్రత్యేక ఏర్పాట్ల ముఖ్య ఉద్దేశం.పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌లను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు