Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు విజ్ఞప్తి.. ఈ చిన్నారిని కాపాడండి!

23 Feb 2026
09:40 AM
230

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :-  ప్రార్థించే పెదవులు కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న అని మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చదివి ఉంటాం. ఈరోజు ఒకరికి కష్టం వచ్చిందంటే ఆ కష్టం మరో మనిషి ద్వారానే తీరాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఏ ఘటనైనా సరే క్షణాల్లోనే రాష్ట్రం, దేశం నలుమూలలో ఎక్కడున్నా తెలుసుకుంటున్నాం. ఇక ఈరోజు సోషల్ మీడియాలో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్నారి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఒకే ఒక ఇంజక్షన్ ఇస్తే ఆ చిన్నారి బ్రతుకుతుంది. కానీ ఆ ఇంజెక్షన్ విలువ అక్షరాల 16 కోట్లకు పైగానే.

Article Image

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు చెందినటువంటి సురేష్ మరియు పుష్పావతి దంపతులకు 10 నెలల చిన్నారి ఉంది. ఈ పాప పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. కొన్ని లక్షలమందిలో ఈ వ్యాధి ఒకరికి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ చిన్నారి పడుకుంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేనిదే ఒకవైపు నుంచి మరో వైపుకు తిరగలేదు. ఈ వ్యాధికి ఇండియాలో వైద్యం లేదు అని.. కచ్చితంగా ఫారన్ లోనే ఈ వ్యాధికి వైద్యం ఉంటుంది అని డాక్టర్లు తెలిపారు. పది నెలల చిన్నారి పునర్విక కోసం రాష్ట్రం లోని యువత మొత్తం కూడా సహాయం కోసం ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ చిన్నారికి డబ్బులు సహాయం చేస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ చిన్నారికి 16 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద లెక్కేం కాదు. కానీ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రముఖ వ్యక్తుల నుంచి సహాయం కోరే లోపే.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యువత ముందుకు వచ్చి 100, 500 అంటూ ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయలను పోగు చేశారు.

Article Image

సేవ్ పునర్విక అనే హ్యాష్ టాగ్ తో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేసేలా చేస్తున్నారు. గత జన్మలో రుణపడి ఉన్నాము అంటూ ఎంతో మంది యువత ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలను సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు పది కోట్లకు మందికి పైగానే ప్రజలు ఉన్నారు. మనిషికి రెండు రూపాయలు చెప్పున వేసుకున్న 20 కోట్లు సులభంగా వస్తాయి. కానీ చాలామందికి ఈ విషయం ఇప్పటికీ తెలియకపోవచ్చు. ఈ చిన్నారి పునర్విక కోసం ఎంతోమంది చిన్న పిల్లలు కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు సైతం సహాయం చేయడానికి వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా వీఐపీ ల సహాయం కోసం కాకుండా ఆ పాప కోసం మేమున్నాము అంటూ ముందుకు వచ్చి ఎంతో కొంత మొత్తంలో డబ్బులును సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు లేదా సినిమా సెలబ్రిటీలు ముందుకు వస్తే క్షణాల్లోనే ఆ పాపకు వైద్యం అందుతుంది. ఆ పాప కేవలం కొద్ది నెలలు మాత్రమే బ్రతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవైపు కొద్ది మొత్తంలో సహాయం అందుతున్న పెద్ద మొత్తంలో సహాయం అందించే వ్యక్తులు ముందుకు రావాలి అని చాలామంది యువత కోరుకుంటున్నారు. నిజానికి అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు తలుచుకుంటే ఈ పాపకు 24 గంటల్లోనే ఆ ఇంజక్షన్ దొరుకుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్ ఇలా కూటమి లేదా వైసిపి పార్టీ నాయకులు పాప ఇంజక్షన్ కోసం సహాయం చేయాలి అని అలాగేే సినిమా సెలబ్రిటీలుు సైతం ఈ విషయంలో ముందడుగు వేయాలి అని  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. బహుశా ఈ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియకపోవచ్చు కానీ మీరు ఈ విషయాన్ని ముఖ్య నాయకులు, సెలబ్రిటీలకు చేరుకునే వరకు దయచేసి షేర్ చేయండి. 10 నెలల చిన్నారి కోసం మనందరం ఉన్నాము అంటూ ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే అంతకంటే ఏముంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీ వంతు సహాయం చేయాలి అని.. కోరుతున్నాము.

 చిన్న మొత్తంలోనైనా దయచేసి సహాయం చేయండి. మన జిల్లా నుంచి కూడా మనం సహాయం చేద్దాం. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!