స్వస్తిక్ న్యూస్, ఫాక్ట్స్ :- ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులు, పోలీసులు, డ్రైవర్లు, టెక్నికల్ ఉద్యోగులు వంటి వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని వైద్యులు వివరించారు.

రాత్రిపూట పని చేయడం, పగలు నిద్రపోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావంతో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. నైట్ షిఫ్ట్‌లను నిరంతరం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వీలైనంత వరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.ఈ విషయాన్ని World Health Organization (WHO) కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే అంశంగా గుర్తించిందని వైద్యులు తెలిపారు. కాబట్టి నైట్ షిఫ్ట్ చేసే వారు సరైన నిద్ర, సమతుల ఆహారం, వ్యాయామం తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.