స్వస్తిక్ న్యూస్, జాతీయ వార్తలు :- ప్రపంచ వ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు గత వారం రోజుల నుంచి పడిపోతూ ఉన్నాయి. వారం రోజుల క్రిందట బంగారం ధరలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. కానీ ఈరోజు బంగారం మరియు వెండి ధరలను చూస్తూ సామాన్యులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ బంగారం మరియు వెండి ధరల పతనం చూస్తుంటే ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలి అంటే ఈ బంగారం, వెండి కొనుగోలు చేయాలి అని షాపులకు వెళ్లినటువంటి సామాన్య ప్రజలకు నిరాశే ఎదురయింది.

బంగారం ధరలు చూసి భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు బంగారం, వెండి ధరల పతనం.. ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ శుభకార్యాల ముందు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సామాన్యులకు ఇది ఒక శుభవార్తనే చెప్పాలి.

ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1420 రూపాయలు తగ్గి రూ. 1,51,750 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1300 పతనమయి రూ. 1,39100 పలుకుతుంది. అలాగే ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 2,80,000 పలుకుతోంది. కేవలం నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో వెండి ధర లక్ష 25 వేల రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లకు మనీ లాస్ అయిన సామాన్యులకు మాత్రం ఇది ఒక శుభవార్త గానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చా అనే ఆలోచన నుంచి బయటకు వస్తున్నారు.