Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

చిన్నస్వామిలో చితక్కొట్టిన బెంగుళూరు.. CSK వరుస ఓటమి!

06 Apr 2026
06:42 AM
160

స్వస్తిక్ న్యూస్, ఐపీల్ :-  ఐపీఎల్‌లో భాగంగా స్థానిక చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ కీలక పోరును వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.

మెరిసిన ప్రముఖులు :- ​ఈ మ్యాచ్‌కు సినీ, క్రీడా మరియు వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ, RCB యజమాని అనన్య బిర్లా, మరియు మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు గ్యాలరీలో సందడి చేస్తూ మ్యాచ్‌ను ఆస్వాదించారు.

RCB వరుస విజయాల రికార్డు :- 2024 సీజన్ నుండి లెక్క చూస్తే, చెన్నైపై ఆర్‌సిబికి ఇది వరుసగా నాలుగో విజయం. ప్రత్యర్థి జట్టుపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బెంగళూరు ఆటగాళ్లు మైదానంలో చెలరేగిపోయారు.

ఓటమి బాధ్యత నాదే: రుతురాజ్ గైక్వాడ్ :- ​మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భావోద్వేగంగా స్పందించారు. ఈ ఓటమికి తానే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. "బ్యాటింగ్‌లో నేను మంచి స్కోరు చేసి ఉండాల్సింది. కీలక సమయంలో రాణించలేకపోవడం జట్టుపై ప్రభావం చూపింది" అని రుతురాజ్ పేర్కొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates