స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా లో గత కొద్ది రోజుల నుంచి వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అన్నమయ్య యజిల్లావ్యాప్తంగా పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభం వారి పల్లె మండలాలలో గత కొద్ది రోజుల నుంచి కోళ్లు చనిపోవడం పట్ల పశుసంవర్ధక శాఖ అప్రమత్తమయ్యింది. ఆయా మండలాలలో ఇప్పటికే చనిపోయినటువంటి కొన్ని వందల కోళ్ల శాంపిల్స్ ను పశువు సంవర్ధక శాఖ భూపాల్ లోని ల్యాబ్ కు పంపించింది.

ల్యాబ్ అధికారులు కోళ్ల శాంపిల్స్ను పరిశీలించిన అనంతరం ఈ కోళ్లకు వైరస్ సోకినట్లుగా నిర్ధారించబడింది అని తెలిపారు. ఇప్పటికే పలు సందర్భాలలో బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు చికెన్ తినాలి అంటేనే భయపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజలందరూ కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని.. 100° లకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్ మరియు గుడ్లను హ్యాపీగా తినొచ్చు అని తెలిపారు. ఏది ఏమైనా కూడా బర్డ్ ఫ్లూ అనగానే ప్రజలందరూ కూడా చికెన్ తినడం మానేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం 100° లకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసినటువంటి నాన్ వెజ్ తినవచ్చు అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది.
