Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / భక్తి వార్తలు

మానేపల్లిలో వైభవంగా గ్రామదేవతల సంప్రోక్షణ, బోనాల ఉత్సవాలు: మే 23, 24 తేదీల్లో వేడుకలు

19 May 2026
03:36 PM
2,796

స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- మానేపల్లి  గ్రామంలో భక్తి భావం వెల్లివిరిసేలా శ్రీ గ్రామదేవతల సంప్రోక్షణ మరియు బోనాల పండుగ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23, 24 తేదీలలో (మే 2026) నిర్వహించ తలపెట్టిన ఈ పవిత్ర ఉత్సవాలకు మానేపల్లి గ్రామ దేవాలయాల కమిటీ మరియు గ్రామ పెద్దలు సర్వసన్నద్ధం చేశారు.

రెండు రోజుల ఉత్సవాల వివరాలు:-

మొదటి రోజు (మే 23, శనివారం):- శనివారం ఉదయం 8:00 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం పుణ్యాహవాచనం, మండపారాధన, గ్రామదేవతల ఆవాహన పూజలను వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రామ జలబిందెల మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది.

రెండవ రోజు (మే 24, ఆదివారం):- ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటల నుంచే భక్తులు సమర్పించే బోనాల కార్యక్రమం ప్రారంభం కానుంది. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి అమ్మవార్లకు నైవేద్యాలు నివేదించనున్నారు.

భక్తులకు విజ్ఞప్తి:-  ఈ మహా సంప్రోక్షణ మరియు బోనాల పండుగను పురస్కరించుకుని మానేపల్లి గ్రామ ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన గ్రామస్తులందరూ కూడా ఈ వేడుకలకు సకుటుంబసమేతంగా విచ్చేసి, గ్రామ సంప్రోక్షణలో పాల్గొని అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని భక్తమహాశయులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ బోనాల పండుగను జయప్రదం చేయాలని కోరుతున్నాం. 

                           జై శ్రీరామ్.. 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates