స్వస్తిక్ న్యూస్, నేషనల్:- కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తూ, రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అక్షయ తృతీయ పర్వదినం దగ్గరపడుతున్న వేళ ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
బంగారం ధరలు:-24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,370 మేర తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 1,54,200 గా నమోదైంది.22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,250 మేర పతనమైంది. ప్రస్తుతం ఇది రూ. 1,41,350 వద్ద పలుకుతోంది.
వెండి ధరలు:-బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
1 కేజీ వెండి ధరప్రస్తుతం రూ. 2,75,000 గా ఉంది. మరియు అక్షయ తృతీయ వేళ ధరలు తగ్గడంతో నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడే అవకాశం ఉంది.