Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్.. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు తీవ్రవడగాలులు

31 Mar 2026
07:59 AM
226

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి, పాలనాడు, కర్నూలు, నంద్యాల, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) వెల్లడించింది.

Article Image

అలాగే మన్యం, పాలనాడు, విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వడగాలులు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. రైతులు, గిరిజనులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates