BREAKING NEWS :- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ కొద్ది గంటల క్రితమే మృతి చెందారు. అతనికి మృత్యువు విమానం రూపంలో రావడం ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుంది. ఈరోజు డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఇవ్వాల ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరారు.

ఉదయం సరిగ్గా 8 గంటల 45 నిమిషాల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం అక్కడికక్కడే కూలిపోయింది. కేవలం సాంకేతికం కారణంగానే నేలను అజిత్ పవార్ ప్రయాణించే విమానం గట్టిగ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ తో పాటుగా మరొక ఆరుగురు అధికారులు మృతి చెందారు. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అజిత్ పవర్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకోగానే అతని కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
