స్వస్తిక్ న్యూస్:- బంగారం రేట్లు
హైదరాబాద్:- గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): నేడు రూ. 820 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,49,840 వద్ద కొనసాగుతోంది.22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆభరణాల తయారీకి వాడే ఈ బంగారం ధర రూ. 750 మేర క్షీణించింది. ప్రస్తుతం దీని ధర రూ. 1,37,350 కి చేరింది.తెలుగు రాష్ట్రాలలోని వివిధ నగరాలు మరియు ప్రాంతాలను బట్టి పన్నులు, స్థానిక ఛార్జీల కారణంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు తెలిపారు.
ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు కొంత ఊరట చెందుతున్నారు.