స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టులో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 బౌలర్ ఎవరని అనగానే కచ్చితంగా ప్రతి ఒక్కరు బుమ్రా అనే పేరుని చెబుతారు. అలాంటి భారత దిగ్గజ బౌలర్ టెస్ట్ కెరియర్ పై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బుమ్రా వయస్సు మెల్లిమెల్లిగా పెరుగుతుంది అని మరోవైపు వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడడం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లతో జరిగేటువంటి టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే బుమ్రా పరిమితం అవుతారు అని తెలియజేశారు. బుమ్రా టెస్ట్ ఆడక పోవడం అనేది టెస్ట్ క్రికెట్కు పెద్ద లోటని అన్నారు. T20,వన్డే మరియు టెస్ట్ వంటి అన్ని ఫార్మేట్ లలో కూడా తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టేటువంటి అరుదైన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బూమ్రా అనే ప్రశంసించారు.
