యర్రగొండపాలెం:- వైసీపీ నేత, అంబటి రాంబాబు ఈరోజు సీఎం చంద్రబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు గాను యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు అంబటి రాంబాబు దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి, దహనం చేసి నిరసన తెలియజేసారు.

ఈ సందర్బంగా అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే చెప్పులతో రోడ్డుపై ఊరేగించే పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులందరూ కూడా అంబటి రాంబాబు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే అంబటి రాంబాబు గృహాలను చుట్టుముట్టి కార్లు మరియు చెట్ల మొక్కలను చల్లాచెదురు చేస్తున్నారు.
