స్వస్తిక్ న్యూస్, కూకట్ పల్లి :- కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ డివిజన్ లోనీ బుదాస్ వేరేడెక్స్ క్లాసిక్ అపార్ట్మెంట్స్ నందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందలపు సాయిబాబు చౌదరి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించటం జరిగింది. బసవతారకం హాస్పిటల్ డాక్టర్ ప్రేరణ మాట్లాడుతూ... ఈ క్యాన్సర్ అనేది అవగాహనతో స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చని, ఒకవేళ వ్యాధి ఉన్నట్లయితే ముందుగా మెడిసిన్ తీసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందుగానే అరికట్టవచ్చని, ప్రతి మహిళ ప్రతి మగవారు భయంతో కాకుండా బాధ్యతగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆవిడ తెలిపారు.

ఈ రోజున సుమారు 250 మంది స్త్రీ, పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధ హోమ్స్ కాలనీవాసులు మాట్లాడుతూ మందలపు సాయిబాబా చౌదరి గత 20 సంవత్సరములుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. కరోనా టైంలో కూడా కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయించారని, పేద ప్రజలకు నిత్య అవసర వస్తువులు పంచిపెట్టడం చేశారని.. అనునిత్యం ప్రజల్లో ఉంటున్న వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని.. రాబోయే రోజుల్లో మంచి ప్రజాప్రతినిధిగా చూడాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రేరణ, ప్రవల్లిక, సౌమ్య, సిమ్రాన్, అబ్దుల్, రేఖ రాజు, గోవర్ధని, వేణు వర్మ, గణేష్, కృష్ణంరాజు,మరియు స్థానికులు రంగరాజ, కాజా నవీన్, రత్నాకర్, త్రినాధ్, సురేష్, గోపాల్ నగర్ సైదుబాబు, నందమూరి కిషోర్, ప్రసాద్, హరి, శ్రీధర్, తేజ, వీరబాబు పాల్గొన్నారు.