స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- సైన్సె ఫెయిర్ లో విద్యార్థులు చేపట్టిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలు అభినందనీయమని పాపిరెడ్డి నగర్ బస్తి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి తెలిపారు. బస్తీ లోని రెయిన్బో హై స్కూల్ లో శనివారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి చంద్రారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనను తిలకించిన చంద్రారెడ్డి సైన్స్ ఫెయిర్ లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న వైజ్ఞానిక నైపుణ్యాలను వెలికి తీసే ఆస్కారం ఉందన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతో పాటుగా దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని తెలియజేశారు. కార్యక్రమంలో నేతలు వెంకటేష్, వనం ఆంజనేయులు, కనకా రెడ్డి, శంకర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.