CINEMA UPDATES :- ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ పై ప్రతి ఒక్కరు కూడా చాలానే ఆశలు పెట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగ, రనవీర్ కబీర్ తో తీసినటువంటి యానిమల్ సినిమాతో ఎంత పెద్ద ఫేమస్ అయ్యారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తుండడంతో ఒకవైపు ప్రభాస్ అభిమానులతో పాటు మరోవైపు దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా ఒక విషయంపై ప్రచారం జరుగుతుంది. స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లుగా.. ప్రభాస్ కు ఫాదర్ రోలులో చిరంజీవి నటించనున్నారు అని ఇప్పటికే సోషల్ మీడియా అంతటా కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు 15 నిమిషాల పాటు కనిపించే ఈ పాత్రకు చిరంజీవి కూడా ఒప్పుకున్నట్లుగా బయట చాలానే టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ప్రకటన రాలేదు.

ఇక మరోవైపు స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది అని.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇస్తాము అని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పోస్టర్ యావత్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ హైప్స్ పెంచుతుంది. ఆ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పిరిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ సృష్టించబోతుంది అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులు కాస్త నిరాశలో ఉండగా మెల్లిమెల్లిగా వస్తున్న అప్డేట్స్ చూసి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా కాస్త నిరాశ నుంచి బయటకు వస్తున్నారు.
