స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పై ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికార మరియు ప్రతిపక్ష నాయకుల మధ్య ఈ అంశంపైనే ఒక యుద్ధం జరుగుతుంది. అయితే తాజాగా ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ...

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే తిరుమలపై కుట్ర జరుగుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా తిరుమల విషయంపై కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు.. రెండు కొండలు చాలు అని ఉత్తర్వులు ఇస్తే దానిపై మేము ఫైట్ చేసి మరి గెలిచిన తర్వాత కొండకు నడిచి వస్తాను అని మొక్కుకొని మరి వెళ్లాను అని తెలిపారు. ఇక ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లలేదు అన్నారు. కానీ నేడు ఈ వైసీపీ పార్టీ నాయకులు ఈ విషయంపై కుట్రలు పన్నుతున్నారు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష పడుతుంది అని చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ నాయకులను హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ...

గత ఐదు సంవత్సరాలలో వైసిపి పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో కల్తీ నెయ్యి విషయంలో దోషులుగా ఉన్నటువంటి ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకేసుకు వస్తున్నారు అని నిలదీశారు. అంటే అతనికి కచ్చితంగా ఈ విషయంలో బాగా ఉన్నట్టే కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వయంగా జంతు అవశేషాలు కలిశాయని NDDB రిపోర్ట్ ఇచ్చిన కూడా వీళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కల్తీ వేరే మతంలో జరిగి ఉంటే ఈపాటికి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేవారు అని వ్యాఖ్యానించారు.