Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగింది.. సీఎం కీలక వ్యాఖ్యలు?

06 Feb 2026
04:53 PM
70

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కల్తీ నెయ్యి లడ్డూల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎమ్మిగనూరు సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ ప్రసాదాలపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అని ఆరోపించారు.

Article Image

సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అని మాజీ చైర్మన్ సుబ్బారెడ్డే ఒప్పుకున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సభలో భాగంగా అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు పాటు కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన బాత్రూం క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు అని పేర్కొన్నారు. NDDB రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను అని.. అబద్ధం చెప్పట్లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Article Image

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లడ్డు విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎప్పటినుంచో ఈ విషయంపై కూటమినేతలు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వైసీపీపై మండిపడుతూనే ఉన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వైసీపీ పార్టీ.. దేవుడిపై పగబట్టింది అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తప్పు చేసిన వ్యక్తులను ఆ దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు అని తెలిపారు. 

Article Image

ఏది ఏమైనా కూడా ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ విషయంపై మీకు ఆసక్తి ఉందో ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ తర్వాత కథనంలో దాని గురించే పూర్తిగా విశ్లేషణ చేసి వార్త రూపంలో మీకు అందజేస్తాం.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!