స్వస్తిక్ న్యూస్,తెలంగాణ :- జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేశారు. ఈరోజు INC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ జీదో లాక్ నౌకరి దో అంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేయడం ప్రతి ఒక్కరికి ఇది ఒక చర్చనీయంశమైన విషయంగా మారింది.

కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎక్కడికి పోయింది అని ధ్వజమెత్తారు. మీ హామీని నమ్మి ఎంతోమంది యువత మీకు ఓట్లు వేసి గెలిపించారు అని స్పష్టం చేశారు. కానీ గెలిచిన తర్వాత ఈ హామీ ఊసే లేదని.. మీ హామీని నమ్ముకుని శిక్ష అనుభవిస్తున్నటువంటి నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అంటూ ప్రశ్నించారు.

ఇంకోవైపు యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారిపోయింది అని అన్నారు. జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే దాని గురించి కూడా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరిగా కాంగ్రెస్ అంటేనే మోసం, దగావంచన అనే మాటను మరోసారి నిలబెట్టుకున్నారు అని కవిత తీవ్రంగా విమర్శలు చేశారు.