స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ ఇప్పుడు ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనర్‌గా జట్టుకు మంచి పునాది వేయాల్సిన గైక్వాడ్, వరుసగా బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గణాంకాలు ఏం చెబుతున్నాయి..? భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో గైక్వాడ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. 180 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గత 12 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఏకంగా 9 సార్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. నిన్నటి రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో, భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.

బ్యాటింగ్‌లోనే కాకుండా, కెప్టెన్‌గా కూడా రుతురాజ్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నారనే వాదన వినిపిస్తోంది. కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డ్ సెటప్‌లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.మొత్తానికి, అటు ఆటగాడిగా.. ఇటు కెప్టెన్‌గా గైక్వాడ్ చెన్నై జట్టుకు భారంగా మారారంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.