AP POLITICS :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులను అలాగే కార్యకర్తలను తీవ్రంగా హింసిస్తున్నారు అని అన్నారు. సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలనకు ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు అని వైయస్ జగన్ పేర్కొన్నారు. మళ్లీ మరో ఏడాదిన్నర తర్వాత కచ్చితంగా పాదయాత్ర చేస్తాను అని.. 150 నియోజకవర్గాలలో పర్యటించి మళ్లీ ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అని మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు పాలన గురించి ప్రజలకు కచ్చితంగా వివరిద్దాము అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా ఈ విషయంపై చర్చలు జరిగేలా పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా చొరవ చూపాలి అని సూచించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కరోనా కష్ట సమయంలో పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది అని ఇక జగన్ 2.0 కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.. ఇది నా హామీ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించుకొచ్చారు.

నిజంగా చెప్పాలి అంటే కరోనా సమయంలో దాదాపు రెండు సంవత్సరాల వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కోవిడ్ కు సంబంధించిన పనులే చూసుకోవాల్సి వచ్చింది.ఒకవేళ జగన్ 2019కి ముందు పాదయాత్ర చేసినట్లు 2029 ఎలక్షన్లకు ముందు కూడా పాదయాత్ర చేస్తే గెలుపు విజయ అవకాశాలు ఎంతలా ఉంటాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈసారి ఎన్ని సీట్ల తేడాతో విజయం సాధిస్తారు అనేది కూడా తెలియజేయండి.