స్వస్తిక్ న్యూస్, తమిళనాడు :- తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న దళపతి విజయ్, ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన పదవ తరగతి (టెన్త్ క్లాస్) మార్క్ షీట్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఈ మార్కుల జాబితాను ఆసక్తిగా గమనిస్తున్నారు.హయ్యర్ సెకండరీ బోర్డ్ మ్యాట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఈ సర్టిఫికెట్‌లో ఆయన పేరు సి. జోసెఫ్ విజయ్ అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఆయన సాధించిన మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం మార్కులు:- 1100 కు గాను 711 మార్కులు సాధించి, 'ఫస్ట్ క్లాస్' లో ఉత్తీర్ణులయ్యారు.
మాతృభాష (తమిళం):- 200 కు 155 మార్కులతో మంచి ప్రతిభ కనబరిచారు.
మ్యాథమెటిక్స్ (గణితం):- 200 కు 95 మార్కులు మాత్రమే సాధించారు. ఈ విషయంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "విజయ్ అన్న మ్యాథ్స్‌లో వీక్ అన్నమాట" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు.
సైన్స్:- 300 కు 206 మార్కులు సాధించారు.
ఇంగ్లీష్:- 200 కు 133 మార్కులు వచ్చాయి.
సోషల్ సైన్స్:- 200 కు 122 మార్కులు సాధించారు. స్కూల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, విజయ్ తన డిగ్రీ చదువును మాత్రం మధ్యలోనే ఆపేశారు. బ్యాచిలర్ డిగ్రీ (విజువల్ కమ్యూనికేషన్) చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో ఆయన ఆ కోర్సును మధ్యలోనే వదిలేసినట్లు సమాచారం.ఒకవైపు ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఇలా ఆయన చిన్ననాటి విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాలు బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.