AI VEDIO :- సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తమిళ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ పెళ్లి జరుగుతుంది అని కొన్ని వార్తలు సంచలనం సృష్టించాయి. వచ్చే నెల 14వ తేదీన వీరిద్దరి పెళ్లి జరుగుతుంది అని కూడా సోషల్ మీడియాలో వార్తలు రాగా వాటన్నిటిని హీరోయిన్ టీం ఇవి ఫేక్ అని కొట్టిపారేసింది. ఎలాంటి కారణాలు లేకుండానే ఈ ప్రచారాలు జరుగుతున్నాయి అని.. అవన్నీ కూడా పూర్తిగా అబద్ధమని.. వీటిని ఎవరు నమ్మొద్దు అని హీరోయిన్ మృనాల్ ఠాకూర్ టీం స్పష్టం చేసింది.

కానీ ఇంతలో మరొక AI వీడియో వీరిద్దరి కొంప ముంచేలా ఉంది. తాజాగా ధనుష్ మరియు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ పెళ్లి చేసుకున్నట్లుగా ఒక AI వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏఐ సృష్టించిన వీడియోలో పంతుళ్ల తో పాటు ఈ పెళ్లికి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, అజిత్, దుల్కర్ సల్మాన్, అనిరుద్, త్రిష,శృతిహాసన్ వంటి ప్రముఖులు హాజరైనట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఈ ప్రచారాలన్నీ కూడా ఫేక్ అని మృనాల ఠాకూర్ టీం కొట్టివేయగా.. మరోవైపు ఈ విమర్శలపై హీరో ధనుష్ ఎలాంటి విధంగా స్పందించలేదు. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీలోని ధనుష్ అభిమానులు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు.
