FACTS :- సాధారణంగా 12 గంటలు పగలు ఉంటే మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ వివిధ దేశాల్లో వాచ్ చూసుకుంటే ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియదు. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొద్ది రోజులు 24 గంటలు సూర్యుడి వెల్తురు ఉంటుంది. దీంతో ఇటువంటి అద్భుత దృశ్యాలను చూసేందుకు ఇతర ప్రదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువ సమయం పాటు సూర్యోదయం ఉండే దేశాల్లో నార్వే ఒకటి. ఈ దేశాన్ని సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు.

ఇది అధిక అక్షాంశంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువ రోజులపాటు సూర్యుడు అస్తమించడు. ఇక్కడ మే నుంచి జూలై వరకు వేసవి నెలలో ఆర్కిటిక్ సర్కిల్ ఉత్తర ప్రాంతంలో 24 గంటలు సూర్యుడు ఉంటాడట. ఇక మిగిలిన ప్రాంతాల్లో 20 గంటలు ఉంటుంది. సాధారణంగా వేసవి నుంచి విముక్తి పొందడానికి జలపాతాలు, పర్వతాలు, హిమనీనదాలు, అగ్నిపర్వతాలను చూసేందుకు ఐస్లాండ్ కు ఎక్కువగా వెళుతుంటారు. అయితే ఇది కూడా ఆర్కిటిక్ సర్కిల్ కు దగ్గరగా ఉంటుంది. దీంతో ఇక్కడ కూడా ఎక్కువసేపు సూర్యుడు ఉదయించే ఉంటాడు. ఇక నార్వేతోపాటు ఫిన్లాండ్, కెనడా, స్వీడన్ వంటి దేశాల్లో సూర్యుడు ఎక్కువసేపు పాటు ఉదయించే ఉంటాడు.
