TELUGU FACTS :- ప్రస్తుతం మనం ఉపయోగించేటువంటి ప్రతి నోటుపై గాంధీ గారి బొమ్మ ఉంటుంది. 10,20,50,100,200,500 ఇలా ఏ నోటు చూసినా కూడా ఆ నోటు పై మహాత్మా గాంధీ నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది. అయితే ప్రతి నోటుపై మహాత్మా గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది అయితే కాదు. అప్పటి కాలంలో బ్రిటిష్ రాజకీయ నాయకుడైనటువంటి "లార్డ్ ఫ్రెడిక్స్ లారెన్స్" ను గాంధీ కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ అనుకోకుండా ఫోటో తీశారు.

ఆ జర్నలిస్టు తీసిన ఫోటోనే క్రాప్ చేసి ఇప్పుడు భారత్ లో ఉపయోగం లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటు పై ముద్రను వేశారు. గాంధీ బొమ్మను ముద్రించిన కరెన్సీ నోట్లు 1996లో పూర్తిస్థాయిలో మనదేశంలో అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు వరకు అశోక స్తంభం ముద్రించి ఉన్న నోట్లు అందుబాటులో ఉండేవి. భవిష్యత్తులో ఈ నోటుపై మహాత్మా గాంధీని ముద్రను తొలగిస్తారు అని కొన్ని సందర్భాలలో వార్తలు విన్నాం. కానీ ప్రస్తుతానికైతే మహాత్మా గాంధీ ముద్రనే వాడకంలో ఉంది.
