Monday, 16 March 2026
Swasthik News
Home / ఆసక్తికరమైన నిజాలు

చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా?

07 Feb 2026
11:45 AM
224

స్వస్తిక్ న్యూస్, ఆరోగ్య రహస్యాలు:- చాలామంది ఈరోజుల్లో చెప్పులు లేకుండా నడవాలి అంటే అమ్మో.. మా వల్ల కాదు అని నిర్మొహమాటంగా ముఖం మీదనే చెప్పేస్తారు. కానీ చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది వారికి తెలియకపోవచ్చు. తాజాగా కొంతమంది వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం... ప్రతి ఒక్కరు  చెప్పులు లేకుండా ప్రతిరోజు ఎంతో కొంత దూరం నడిస్తే శరీరానికి, మెదడుకు చాలా మంచిదట. చెప్పులు లేదా షూ లేకుండా ఈ భూమి( గడ్డి, ఇసుక, మట్టి ) పై నడవడం వల్ల మెదడు ఒత్తిడి తగ్గుతుంది అని న్యూట్రినిస్టులు చెబుతున్నారు.

Article Image

 ఇలా చెప్పులు లేదా షూలు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్( ఎర్తింగ్) అంటారు. ప్రతిరోజు చెప్పులు లేకుండా కొంత దూరం నడవడం వల్ల కండరాలు యాక్టివ్ గా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ న్యూట్రిలైజ్ అవుతాయి. ఇక మనిషి నాడీ వ్యవస్థ మెరుగ్గా అలాగే చురుగ్గా పనిచేస్తుంది. జాగింగ్ అనేది చెప్పులు లేకుండా చేయడంతో కారిటిసాల్ ఉత్పత్తి అనేది మరింత తగ్గుతుంది అట. దీని ద్వారా ఎక్కువ నొప్పులు లేదా వాపులు ఉన్నా కూడా తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది అని... వాటితో పాటు గుండెకు సంబంధించి వ్యాధులు కూడా మన దరిచేరవు అని చెబుతున్నారు. వీటన్నిటికి మించి మనుషుల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజు చెప్పులు, షూ లు ధరించి ఎక్కువసేపు నడవడం కన్నా చెప్పులు లేకుండానే ఆయా చోట్ల నడవడం మంచిది.

ADVERTISEMENT

Article Image

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!