Monday, 16 March 2026
Swasthik News
Home / ఆసక్తికరమైన నిజాలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుర్రోడు ఎవరో తెలుసా?

05 Feb 2026
02:29 PM
234

స్వస్తిక్ న్యూస్, వైరల్ :-  సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎవరో ఒకరు రాత్రికి రాత్రి వైరల్ అవుతూ ఉంటారు. అయితే వైరల్ అయినా ఎంతోమంది కొద్ది రోజుల్లోనే మళ్లీ కనిపించకుండా పోతారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో నవ్వించే ఒక కుర్రాడు ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో మనం చూడాల్సిందే. చేతిలో టీ గ్లాస్ పట్టుకొని, పళ్ళు కనిపిస్తూ హహహ.. అని నవ్వుతూ కనిపించే దృశ్యం మనం ప్రతిరోజు ఇన్స్టా  లేదా యూట్యూబ్ లోని కొన్ని మీమ్స్ లలో చూస్తూ ఉంటాం. ఆ కుర్రోడు నవ్విన తర్వాత ప్రతి ఒక్కరి ముఖం నుంచి నవ్వు రావాల్సిందే. ఇంతకసలు ఎవరూ ఆ అబ్బాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Article Image

VIRAL MAN 😃

 పైనున్న ఫోటోలో కనపడుతున్న యువకుడి పేరు అరుణ్. ప్రతి ఒక్కరికి నవ్వితెప్పించే ఈ యువకుడు మన పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన యువకుడు అని చాలామంది కూడా చెబుతూ ఉన్నారు. కానీ అది తప్పు. ఈ కుర్రాడు అక్షరాల తెలంగాణ రాష్ట్ర నివాసితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని,మాలపల్లి గ్రామానికి చెందినవాడు. ఈ యువకుడు లారీ క్లీనర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ లారీ డ్రైవర్ నెహ్రూ ఈ వీడియోని తీసారు అని స్వయంగా అరుణే చెప్పారు. డ్రైవర్ జోక్ చేస్తూ వీడియో తీస్తుండగా ఆ జోకు కు నవ్వు రావడంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కేవలం అప్లోడ్ చేసిన ఒక నెలలోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ రోజుల్లో మీమ్స్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియోలో ఇతని నవ్వుతున్న క్లిప్ ఉండాల్సిందే.

 మీకు ఈ విషయం నచ్చితే మీ ఫ్రండ్స్ కు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!