FACTS :- మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి బైక్స్ పెట్రోల్ తో నడుస్తుంది అని మనకు తెలుసు. కానీ మీలో చాలామందికి అసలు డీజిల్ బైక్స్ ఎందుకు తయారు చేయడం లేదు అనే ప్రశ్న తలెత్తవచ్చు. సాధారణంగా పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు డీజిల్ తో బైక్ ను తయారు చేస్తే డబ్బు ఆదా అవుతుంది కదా అని చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ డీజిల్ బైకులు తయారు చేయకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్.. డీజిల్ ఇంజన్ కన్నా భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజన్లు పెట్రోల్ తో పోలిస్తే చాలా ఖరీదైనవి. అంతేకాకుండా డీజిల్ ఇంజన్ లో వైబ్రేషన్ మరియు శబ్దాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. డీజిల్ కు పెద్ద ఇంజన్ అవసరం అవుతుంది. ఇది బైకు కు అసలు సెట్ కాదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువగాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరమవుతుంది. ఈ అన్ని కారణాలు దృష్టిలో ఉంచుకోవడం కారణంగానే డీజిల్ బైక్స్ తయారు చేయలేరు. ఒకవేళ తయారు చేసిన వాటి వల్ల మీకు ఎక్కువగా నష్టాలు తప్పితే ఉపయోగం అనేది ఉండదు.
