స్వస్తిక్ న్యూస్,తెలంగాణ :- రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయిల్ డీలర్లు స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వారు స్పష్టం చేశారు. వాహనదారులు అనవసరంగా భయపడుతూ పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ఎలాంటి నిల్వల సమస్య లేదని డీలర్లు పేర్కొన్నారు. రిఫైనరీల నుంచి సరఫరా యథావిధిగా జరుగుతోందని చెప్పారు.

కొందరు యజమానులు ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ప్రయత్నించడం వల్ల బంకుల వద్ద రద్దీ పెరిగిందని వివరించారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన కొరతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని డీలర్లు సూచించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, అన్ని పెట్రోల్ బంకుల్లో సాధారణంగా ఇంధనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధికారులు ఈ డీజిల్ మరియు పెట్రోల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదు అని వివరిస్తున్న కూడా చాలామంది అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరుకొని ఎక్కువ మోతాదులో ఇంధనాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.