స్వస్తిక్ న్యూస్, మార్కాపురం :-జగ్గయ్యపేటలో సోమవారం జరిగిన ఏపీ అండ్ తెలంగాణ (AP&TG) రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మార్కాపురం జిల్లా (ప్రస్తుత ప్రకాశం జిల్లా పరిధిలోని) దోర్నాల మండలానికి చెందిన నారాయణస్వామి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తన అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా నాలుగు విభాగాల్లో పసిడి పతకాలను ముద్దాడాడు.వివిధ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో నారాయణస్వామి తన సత్తా చాటాడు.
»ఫ్రీస్టైల్ 50 మీటర్ల విభాగం
»బ్రెస్ట్ స్ట్రోక్ 25 మీటర్ల విభాగం
»బటర్ ఫ్లై 25 మీటర్ల విభాగం
»ఫ్రీస్టైల్ 25 మీటర్ల విభాగం
పై నాలుగు విభాగాల్లోనూ ఎవరికీ అందనంత వేగంతో ఈత కొట్టి ప్రథమ స్థానంలో నిలిచి, నాలుగు బంగారు పతకాలను (Gold Medals) తన ఖాతాలో వేసుకున్నాడు.రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, నాలుగు పసిడి పతకాలు సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమ ప్రాంతానికి చెందిన యువకుడు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం పట్ల దోర్నాల మండల ప్రజలు, క్రీడాభిమానులు నారాయణస్వామికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.