స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :-నేడు రెండు ఆసక్తికరమైన మ్యాచ్‌లు.. కేకేఆర్‌కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం.
క్రీడా విభాగం:-ఐపీఎల్ అభిమానులకు నేడు అసలైన వినోదం పంచేందుకు సిద్ధమైంది. నేడు జరగనున్న రెండు కీలక మ్యాచ్‌లలో అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు నేటి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.మొదటి పోరు కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్నేడు మధ్యాహ్నం జరగబోయే మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) విశేషం ఈ మ్యాచ్ కేకేఆర్‌కు అత్యంత కీలకం. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఓడిపోతే, కేకేఆర్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటిబాట పట్టినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండో పోరు పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్.ఇక రాత్రి జరగబోయే రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు ఢీకొనబోతున్నాయి.వేదిక చండీగఢ్సమయం: రాత్రి 7:30 గంటలకు.పాయింట్ల పట్టిక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ (PBKS) అగ్రస్థానంలో (ఫస్ట్ ప్లేస్) కొనసాగుతుండటం విశేషం. ఈ ఊపును కొనసాగించాలని పంజాబ్ పట్టుదలగా ఉంది.నేటి రెండు ఫలితాలు పాయింట్ల పట్టికలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. క్రీడాభిమానులు ఈ డబుల్ ధమాకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.